BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 02:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కేయూ పరీక్షల విభాగం నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆందోళన..

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 02:32 PM
12 వీక్షణలు

హాల్‌టికెట్లలో తప్పులతో ఇబ్బందులు

సోమవారం నుంచి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు.. హాల్‌టికెట్లలో సబ్జెక్టుల పేర్లు గల్లంతయ్యాయని విద్యార్థుల ఆరోపణ

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరీక్షల విభాగం తీరుపై డిగ్రీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్‌టికెట్లలో తప్పులు దొర్లుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో హాల్‌టికెట్లలో తలెత్తిన లోపాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్లలో వారు రాయాల్సిన సబ్జెక్టుల పేర్లు కనిపించడం లేదని, కొన్ని సబ్జెక్టులు గల్లంతయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. పరీక్షలకు కొద్ది సమయం మాత్రమే ఉండటంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

హాల్‌టికెట్లలో ఉన్న తప్పులను ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.

పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి సాంకేతిక, పరిపాలనా లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యేలోగా హాల్‌టికెట్లలోని తప్పులను సరిచేసి, అన్ని సబ్జెక్టుల వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని విద్యార్థులు కేయూ పరీక్షల విభాగం అధికారులను కోరుతున్నారు.