BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 06:17 am
Posted by : NAGARAJU GADE

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
12 Nov, 2026 - 06:17 AM
2 వీక్షణలు

ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం.. WIPO సహకారం అందించాలి

మేధో సంపత్తి హక్కులు, పేటెంట్లపై WIPO డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో సీఎం చంద్రబాబు చర్చలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఆవిష్కరణలు, పరిశోధన, సృజనాత్మకతకు మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు స్టార్టప్ కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) సహకారం అందించాలని కోరారు.

విశాఖపట్నంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నోవోటెల్ హోటల్‌లో పలు వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

రాష్ట్రంలోని స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంపొందించడం, వారి ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా కొత్త ఆలోచనలు, సాంకేతిక ఆవిష్కరణలను మేధో సంపత్తి హక్కుల ద్వారా రక్షించుకోవడం, వాటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలపై దృష్టి సారించారు.

WIPO–ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటుపై చర్చ

WIPO–ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఏర్పాటు చేసే అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఈ అకాడమీతో పాటు భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించారు.

మేధో సంపత్తి హక్కులు (IPR), పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా ఆవిష్కర్తలు తమ సృజనాత్మక ఆలోచనలకు చట్టపరమైన రక్షణ పొందేందుకు వీలుంటుందని చర్చించారు. ఈ అంశాల్లో అంతర్జాతీయ సంస్థల నైపుణ్యం, సహకారం రాష్ట్రంలోని పారిశ్రామిక, స్టార్టప్ రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడం, యువతలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మేధో సంపత్తి హక్కులపై అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడం ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి. WIPO సహకారంతో శిక్షణ, అవగాహన కార్యక్రమాలను విస్తరించే అవకాశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.