నల్లవాగు ఉధృతి.. ఊటుకూరు–నెమలి రాకపోకలు నిలిచిపోయాయి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఊటుకూరు–నెమలి గ్రామాల మధ్య ఉన్న నల్లవాగులో వరద ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రెండు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.