BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 02:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండల పరిషత్‌పై టీడీపీ జెండా.. మూడోసారి ఎంపీపీ పీఠం కైవసం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 02:57 PM
107 వీక్షణలు

చాట్రాయి, నవంబర్ 19: చాట్రాయి మండల పరిషత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన పట్టును నిలబెట్టుకుంది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని మూడోసారి కైవసం చేసుకుంటూ తన రాజకీయ ప్రాధాన్యతను చాటుకుంది. నూతన మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొల్లి సత్యవతి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాధ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ మండల పరిషత్ సభ్యులు తుమ్మగూడెం ఎంపీటీసీ కొల్లి సత్యవతికి మద్దతు తెలపడంతో ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కోటపాడు ఎంపీటీసీ సభ్యుడు మోదుగుమూడి రమేష్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో చాట్రాయి మండల పరిషత్‌లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు రెండూ తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరాయి. మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి చాట్రాయి మండల పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకోవడం ఇది మూడోసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా ఎన్నికతో మండల పరిషత్ పాలనలో మరోసారి టీడీపీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షురాలికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బి. శ్వేత, ఎంపీడీవో బి.ఎ. సత్యనారాయణ, ఏవో దమయంతి పాల్గొని నూతనంగా ఎన్నికైన ఎంపీపీ కొల్లి సత్యవతి, ఉప ఎంపీపీ మోదుగుమూడి రమేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.