BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లాలో 16 మండల పరిషత్‌లపై టీడీపీ పట్టు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:49 PM
28 వీక్షణలు

అన్ని మండలాల్లోనూ టీడీపీ అధ్యక్షుల ఎన్నిక.. ఉపాధ్యక్ష స్థానాల్లో 13 టీడీపీ, 3 జనసేనకు అవకాశం

విజయవాడ, నవంబర్ 19: ఎన్టీఆర్ జిల్లాలో మండల పరిషత్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జిల్లాలోని మొత్తం 16 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలనూ టీడీపీ అభ్యర్థులే కైవసం చేసుకోవడం విశేషం. ఉపాధ్యక్ష స్థానాల్లో 13 చోట్ల టీడీపీ అభ్యర్థులు, మరో మూడు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. దీంతో జిల్లా పరిషత్ రాజకీయాల్లో కూటమి బలం మరోసారి స్పష్టమైంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ జి. లక్ష్మీశ ఎన్నికల ప్రక్రియ వివరాలను వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. మండలాల వారీగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు


* చందర్లపాడు: అధ్యక్షురాలిగా దాసర నరసమ్మ, ఉపాధ్యక్షుడిగా నల్లాని శ్రీనివాసరావు (ఇద్దరూ టీడీపీ).


  •  జగ్గయ్యపేట: అధ్యక్షురాలిగా కట్టా సరస్వతి, ఉపాధ్యక్షురాలిగా మువ్వ పద్మ (టీడీపీ).
  •  కంచికచర్ల: అధ్యక్షురాలిగా శివనాగమల్లేశ్వరి కొగంటి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా నాయిని త్రివేణి (జనసేన).
  • నందిగామ: అధ్యక్షురాలిగా గడిపర్తి సుశీల (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా రుద్రపోగు వెంకటరావమ్మ (జనసేన).
  •  పెనుగంచిప్రోలు: అధ్యక్షురాలిగా గజ్జి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా గజ్జి కృష్ణమూర్తి (టీడీపీ).
  •  వత్సవాయి: అధ్యక్షురాలిగా పెరుమాళ్లపల్లి సునీత, ఉపాధ్యక్షురాలిగా స్వప్న పెంటేల (టీడీపీ).
  •  వీరులపాడు: అధ్యక్షురాలిగా నండ్రు వనిత, ఉపాధ్యక్షుడిగా మేకపోతుల నర్సిరెడ్డి (టీడీపీ).
  •  ఎ.కొండూరు: అధ్యక్షుడిగా భూక్య సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా జాస్తి శ్రీ చందన్ (టీడీపీ).
  •  గంపలగూడెం: అధ్యక్షురాలిగా బురుగు అంజలి, ఉపాధ్యక్షుడిగా చెరుకూరి సాయిచంద్ (టీడీపీ).
  •  రెడ్డిగూడెం: అధ్యక్షుడిగా ముప్పిడి నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడిగా బొమ్మిన కోటేశ్వరరావు (టీడీపీ).
  • తిరువూరు: అధ్యక్షుడిగా గద్దె వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా కోమటి వెంకటరామారావు (టీడీపీ).
  •  విస్సన్నపేట: అధ్యక్షురాలిగా వల్లభనేని రాణి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా సంబారు విజయలక్ష్మి (టీడీపీ).
  • జి.కొండూరు: అధ్యక్షురాలిగా గెరా అనిత, ఉపాధ్యక్షురాలిగా అనురాధిక వుయ్యూరు (టీడీపీ).
  • ఇబ్రహీంపట్నం: అధ్యక్షురాలిగా గొరిజాల వెంకట శివకుమారి (టీడీపీ), ఉపాధ్యక్షురాలిగా చింతల లక్ష్మీకుమారి (జనసేన).
  •  మైలవరం: అధ్యక్షురాలిగా వేముల సరోజిని (టీడీపీ), ఉపాధ్యక్షుడిగా సూరిసెట్టి రమణ (జనసేన).

విజయవాడ రూరల్: అధ్యక్షుడిగా పరుచూరి నరేష్, ఉపాధ్యక్షుడిగా నబిగాని కొండయ్య (టీడీపీ). జిల్లాలోని 16 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, మహిళా కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా మండలాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో మండల స్థాయిలో ఆ పార్టీ తన రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకున్నట్లయింది. ఉపాధ్యక్ష స్థానాల్లో జనసేనకు మూడు పదవులు దక్కడంతో కూటమి భాగస్వామ్యానికి కూడా ప్రాతినిధ్యం లభించింది.