BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 01:22 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీచర్లకు BLO, ఎన్నికల విధులు అప్పగించవచ్చు: అలహాబాద్ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 01:22 PM
24 వీక్షణలు

విద్యార్థుల విద్యా హక్కుకు భంగం కలుగుతుందన్న వాదన తిరస్కరణ.. పిటిషన్ కొట్టివేత

ప్రయాగ్‌రాజ్ (ఎన్ టుడే న్యూస్):

ఉపాధ్యాయులను బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO), స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సహా ఇతర ఎన్నికల విధులకు నియమించడాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. టీచర్లకు ఎన్నికల విధులు అప్పగించడం వల్ల విద్యార్థుల విద్యా హక్కుకు భంగం కలుగుతుందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది.

ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల్లో బోధనేతర బాధ్యతలను అప్పగించకూడదని ఎక్కడా పేర్కొనలేదని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను నియమించడాన్ని తప్పుబట్టలేమని అభిప్రాయపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పుర్‌లో అసిస్టెంట్ టీచర్లకు BLO విధులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉపాధ్యాయులకు ఎన్నికల సంబంధిత విధులు అప్పగించడంపై దాఖలైన ఈ పిటిషన్‌లో పిటిషనర్లకు చుక్కెదురైంది.