BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 09 October 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ ఉత్సవ్ 2.0కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 08:57 PM
12 వీక్షణలు

దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

విజయవాడ: విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని విజయవాడ ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), సాన సతీష్ బాబు, ఎంపీ భరత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించనున్న ఉత్సవాల్లో పాల్గొని వేడుకలను ఆస్వాదించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందేందుకు విజయవాడకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. విజయవాడ దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0ను జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ఎంపీలు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా విజయవాడ నగర ఆధ్యాత్మిక ప్రాశస్త్యంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు, చారిత్రక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు.