ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీలకు భారీగా స్టైపెండ్ పెంపు
రూ.13,754 నుంచి రూ.29,792కు హౌస్ సర్జన్ల స్టైపెండ్.. పీజీలకు రూ.74,482
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు (GO) జారీ చేసింది.
ఇప్పటివరకు నెలకు రూ.13,754గా ఉన్న హౌస్ సర్జన్ల స్టైపెండ్‌ను రూ.29,792కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకు నెలకు రూ.34,385 నుంచి రూ.74,482కు స్టైపెండ్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయంతో ఆయుష్ విభాగాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. స్టైపెండ్ పెంపుపై కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
స్టైపెండ్ పెంపు నిర్ణయం ఆయుష్ వైద్య విద్యార్థులకు, హౌస్ సర్జన్లకు, పీజీ విద్యార్థులకు ఆర్థికంగా మరింత ప్రోత్సాహాన్ని అందించనుందని వారు పేర్కొన్నారు.