BREAKING
thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు
Date of Publish : 23 September 2026, 07:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోటీ పరీక్షల సిలబస్‌పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:08 AM
4 వీక్షణలు

తెలంగాణలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. పలు నియామక పరీక్షల సిలబస్‌లో మార్పులు చేస్తున్నారంటూ అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో సందేహాలు, వినతులు రావడంతో కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం సిలబస్‌లో మార్పులు చేసేందుకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో సిలబస్‌లో పెద్దస్థాయిలో మార్పులు చేయాలని నిర్ణయిస్తే.. అభ్యర్థులకు తగినంత సమయం ఉండేలా కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని కమిషన్ కార్యదర్శి తెలిపారు.

అదేవిధంగా సిలబస్‌లో స్వల్ప మార్పులు చేసినా వాటిని అభ్యర్థులకు తెలియకుండా ఉంచబోమని టీజీపీఎస్సీ పేర్కొంది. సంబంధిత ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసే సమయంలోనే సవరించిన సిలబస్‌ వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

సిలబస్‌ మార్పులపై సామాజిక మాధ్యమాలు, ఇతర అనధికారిక వేదికల్లో వస్తున్న ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని కమిషన్ సూచించింది. పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, అర్హతలు, నియామక ప్రక్రియ వంటి అంశాలపై అధికారిక సమాచారం కోసం టీజీపీఎస్సీ విడుదల చేసే నియామక ప్రకటనలు, అధికారిక సిలబస్‌ వివరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.