BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 02:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తాటి చెట్టుపై నుంచి జారిపడి కల్లు గీత కార్మికుడి మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 02:01 PM
16 వీక్షణలు

కల్లు గీయడానికి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదం.. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు, చెట్టు కింద విగతజీవిగా గుర్తింపు

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం ఫకీర్‌గూడెం గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి బెజ్జనబోయిన నాగయ్య (52) మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. ఫకీర్‌గూడెం గ్రామానికి చెందిన నాగయ్య కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

రాత్రి అయినప్పటికీ నాగయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతూ వెళ్లారు. ఈ క్రమంలో తాటి చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్న నాగయ్యను గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు. నాగయ్య మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.