BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మండల వైస్ ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ.. టీడీపీలో అనూహ్య ట్విస్ట్ అధికారులు ప్రకటించిన పేరు ఒకటి.. వేదికపై ప్రకటించిన పేరు మరొకటి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 08:02 PM
42 వీక్షణలు

మాజీ మంత్రి జవహర్ జోక్యంతో మారిన ప్రకటన.. ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉంటానన్న ఎంపీటీసీ ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో రాజకీయ చర్చకు దారితీసింది. వైస్ ఎంపీపీ ఎంపిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు చివరి నిమిషంలో ఉత్కంఠకు తెరలేపాయి. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన పేరు ఒకటి కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై మరో పేరు ప్రకటించడంతో మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తిరువూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా గద్దె వెంకటేశ్వరరావు (వెంకన్న) ఎన్నికైన అనంతరం వైస్ ఎంపీపీ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైస్ ఎంపీపీగా కోమటి వెంకట రామారావు పేరును అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావుతో పాటు కోమటి వెంకట రామారావు కూడా వైస్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ పరిణామాల మధ్య జి.కొత్తూరు ఎంపీటీసీ మడిపల్లి యోహాను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానని స్పష్టం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన పేరును పక్కనపెట్టి మరో ఎంపీటీసీ పేరును తెరపైకి తీసుకురావడంపై జి.కొత్తూరుకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు మాజీ మంత్రి జవహర్ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఆయన జోక్యంతో టీడీపీ మండల అధ్యక్షుడు, ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవ వేదికపై గానుగపాడు ఎంపీటీసీ మడిపల్లి యోహాను పేరును వైస్ ఎంపీపీగా ప్రకటించారు. దీంతో అప్పటికే ఎన్నికల అధికారులు కోమటి వెంకట రామారావు పేరును అధికారికంగా ప్రకటించి, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యంలో ఈ ప్రకటన కొత్త చర్చకు తెరలేపింది. ఈ పరిణామాలపై జి.కొత్తూరు, గానుగపాడు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మండల స్థాయి నాయకులు తమను మోసం చేశారంటూ పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైస్ ఎంపీపీ ఎంపిక విషయంలో ముందుగా తీసుకున్న నిర్ణయం ఏమిటి, అధికారికంగా ప్రకటించిన పేరును మార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, వేదికపై మరో పేరు ప్రకటించడానికి ఆధారాలేమిటి అనే అంశాలపై స్థానికంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోమటి వెంకట రామారావు పేరును అధికారికంగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించిన నేపథ్యంలో, అనంతరం జరిగిన మరో ప్రకటనకు అధికారికంగా ఎంతవరకు గుర్తింపు ఉంటుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత ఎన్నికల అధికారులు, పార్టీ నాయకత్వం స్పందిస్తేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.