BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు రాజీవ్ భవన్‌లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఉక్కు మహిళ సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 08:02 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా – తిరువూరు: భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను తిరువూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీది ప్రత్యేకమైన స్థానమని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి ఆమె చేసిన కృషి, తీసుకున్న కీలక నిర్ణయాలు, మహిళా సాధికారతకు అందించిన ప్రోత్సాహం చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ పట్ల ఆమె చూపిన నిబద్ధత, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని నాయకులు పిలుపునిచ్చారు. ఆమె చూపిన మార్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ బాబు, సీనియర్ నాయకులు గంజా కృష్ణమోహన్, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి చిన్నంశెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, రాములు, పర్వతం రామారావు, గంధం శ్రీనివాసరావు, గరికపాటి నరసింహారావు, కుదరవల్లి రమణారావు తదితరులు పాల్గొన్నారు.