BREAKING
పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి
Date of Publish : 09 September 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: స్థానిక ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల సన్నద్ధత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:20 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్‌తో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

గత తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో జిల్లాలోని పార్టీ కార్యకర్తల్లో ఉన్న భయం పూర్తిగా తొలగిపోయిందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన వారిని గుర్తుంచుకోవాలని, సమయం వచ్చినప్పుడు చట్టపరంగా వారిని ఎదుర్కొనే బాధ్యత పార్టీ తీసుకుంటుందని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తిరువూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి బలమైన నియోజకవర్గంగా ఉందని అవినాష్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధిక విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న ‘జగనన్న 2.0’లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తే రాజుగా ఉండబోతున్నారని పేర్కొన్నారు.

పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి, టీడీపీ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని దేవినేని అవినాష్ అన్నారు. ప్రతి కార్యకర్తకు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని, పార్టీ కూడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

స్థానిక ఎన్నికలపై దృష్టి

నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఆ ఫలితాలను వైఎస్ జగన్‌కు కానుకగా అందించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

12 వేల మంది కార్యకర్తలకు గుర్తింపు కార్డులు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలిచే ఉద్దేశంతో పార్టీ అధినాయకత్వం నిర్ణయం మేరకు సమావేశంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులను దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాస్ అందజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 12 వేల మంది కార్యకర్తలకు త్వరలో గుర్తింపు కార్డులు అందజేస్తామని పార్టీ నాయకులు వెల్లడించారు.