BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 04:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు శాంతినగర్‌లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా.. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 04:28 PM
79 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి) 71వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తిరువూరు శాంతినగర్ అభ్యుదయ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో డీవైఈవో శ్యాంసుందర్ మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఎంఈవో బి. వీరభద్రరావు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంకురాత్రి జనార్దన్ రావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాళ్లూరి రామారావు, నడిం తిరువూరు పీఏసీఎస్ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్ (బాబీ) పాల్గొన్నారు.

విద్యార్థుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత నాయకులు మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో చిరంజీవి ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. కృషి, క్రమశిక్షణ, మానవత్వంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటుడని కొనియాడారు.

బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న చిరంజీవి నటుడిగానే కాకుండా మానవత్వానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎన్నో ప్రశంసలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానుల గుండెల్లో నిత్య చిరంజీవిగా నిలిచిపోతారని తెలిపారు.

చిరంజీవి ఎనర్జీ, డ్యాన్స్, నటన తెలుగు సినీ రంగంలో ఒక చరిత్రగా నిలిచాయని, నాలుగు దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావుతో పాటు తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు రామిశెట్టి జగన్, లింగినేని సుధాకర్ (అడ్వకేట్), పసుపులేటి రవీంద్ర, నామా నాగరాజు, పరసా పుల్లారావు, పుట్రేల పీఏసీఎస్ చైర్మన్ కస్తూరి, సీతారామస్వామి, చింతలపాటి వెంకటకృష్ణ, గంపలగూడెం మండల అధ్యక్షులు నవీప్ మల్లెల శ్రీనివాస్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంగాల మురళి, నాళ్లా సురేంద్ర, బొడ్డు శ్రీను, కలిశెట్టి రాంబాబు, పరిసే సీతారామలింగేశ్వరరావు, చిత్తులూరి పండు, అఖిల భారత చిరంజీవి యువత నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.