BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో నందన్ వైన్స్‌లో కల్తీ మద్యం విక్రయాల ఆరోపణలు.. అధికారుల చర్యలు కోరుతున్న వినియోగదారులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
88 వీక్షణలు

తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డులో శ్రీ సూర్య రెస్టారెంట్ సమీపంలో ఉన్న నందన్ వైన్స్‌లో కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మద్యం నాణ్యతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు వినియోగదారులు వైన్స్ నిర్వాహకులతో వాగ్వాదాలకు దిగుతున్నట్లు సమాచారం.

వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పటికీ, నిర్వాహకులు సరైన స్పందన ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నాసిరకం మద్యం విక్రయాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ నాటు సారా విక్రయాలపై చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి, నందన్ వైన్స్‌లో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.