BREAKING
thumb ● అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb ● పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb ● మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb ● మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb ● దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb ● దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb ● గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb ● అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb ● పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb ● మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb ● మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb ● దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb ● దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb ● గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు..
Date of Publish : 10 August 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తునికిపాడులో ముసుగు దొంగల బీభత్సం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 06:32 PM
111 వీక్షణలు

తునికిపాడులో ముసుగు దొంగల బీభత్సం

  • ఒకే రాత్రి రెండు ఇళ్లు.. అంకమ్మ ఆలయంలో చోరీ

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగు దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒకే రాత్రిలో రెండు ఇళ్లు, ఓ ఆలయంలో వరుస చోరీలకు పాల్పడి భారీగా బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

తునికిపాడుకు చెందిన రమావతు కృష్ణకుమారి ఇంట్లోకి చొరబడిన దుండగులు 20 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ.45 వేల నగదును దొంగిలించినట్లు సమాచారం. అనంతరం నందిగామలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గద్దల పుల్లారావు ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్న దొంగలు 40 గ్రాముల బంగారం, 6 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదును అపహరించారు.

అదే రాత్రి గ్రామంలోని అంకమ్మ తల్లి ఆలయాన్ని కూడా దొంగలు వదల్లేదు. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి అందులోని సుమారు రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇలా ఒకే రాత్రి మూడు ప్రాంతాల్లో వరుస చోరీలు జరగడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. రాత్రి వేళ గ్రామంలో సంచరిస్తూ ఇళ్లను, ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగుల కదలికలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. చోరీ జరిగిన ఇళ్లు, ఆలయంలో ఆధారాలు సేకరించడంతో పాటు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా ముసుగు దొంగలను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరుస చోరీలతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.