BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 04:58 pm
Posted by : GOUTHAM RUDRARAPU

దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ
/ సంగారెడ్డి / అమీన్‌పూర్
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 04:58 PM
245 వీక్షణలు

బీరంగూడ: కిష్టారెడ్డిపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో దుర్గానగర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలకు కాటా సుధారాణి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు.

అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీవాసులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

కాలనీ సమస్యలపై విజ్ఞప్తి

ఈ సందర్భంగా దుర్గానగర్ కాలనీ కమిటీ సభ్యులు, స్థానికులు తమ ప్రాంతంలోని పలు సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్థలం, పిల్లలు ఆడుకునేందుకు పార్కు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కాలనీ అభివృద్ధికి సహకరిస్తామని, సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఘనంగా మహా అన్నదానం

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో కాలనీ ప్రజలు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

కార్యక్రమాలతో దుర్గానగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల నిర్వహణలో దుర్గానగర్ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.