BREAKING
thumb అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు..
Date of Publish : 24 September 2026, 10:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 10:05 PM
12 వీక్షణలు

అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో వివరాలు వెల్లడించారు.

జాతీయ బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరించి, అదే రోజు మధ్యాహ్నం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన పింఛను తీసుకోలేని వారికి అక్టోబర్ 3వ తేదీన పింఛను అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు.

సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను పంపిణీ సమయంలో ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీఏ పీడీ టి.విజయలక్ష్మి, డీపీఓ మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.