BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 05 October 2026, 10:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలి

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 10:16 AM
1 వీక్షణలు

సిద్దిపేట జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పదేళ్ల పండుగ వేడుకలను జిల్లా ఖ్యాతి, కీర్తి ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, ప్రముఖులతో పదేళ్ల పండుగ నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా ఏర్పాటు కోసం అప్పట్లో దరఖాస్తు చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను ఏర్పాటు చేసి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారని అన్నారు. జిల్లాకు గోదావరి జలాలు, రైలు సౌకర్యం సాధించాలన్న నినాదాలను సాకారం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు పదేళ్ల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా ఆవిర్భవించిన అక్టోబర్ 11న అన్ని వర్గాల భాగస్వామ్యంతో పదేళ్ల పండుగ సభ నిర్వహించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ముందు పరిస్థితులు, ప్రస్తుతం సాధించిన అభివృద్ధిని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సిద్దిపేట చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి తదితర అంశాలతో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించాలని సూచించారు. నాటి సిద్దిపేట, నేటి సిద్దిపేటపై సమగ్ర డాక్యుమెంటరీ రూపొందించాలని అన్నారు. పదేళ్ల పండుగను ప్రజలందరూ భాగస్వాములయ్యేలా వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పాటుతో సాధించిన అభివృద్ధి, ఫలితాలపై జర్నలిస్టులు, కవులు, రచయితలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో చర్చావేదికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గుండు భూపేష్‌తో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.