BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 05:03 pm
Posted by : కూనురు మధు

నేరడలో వైభవంగా 11వ లక్ష తులసీ దళార్చన మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Nov, 2026 - 05:03 PM
21 వీక్షణలు

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు.. సామూహిక లక్ష్మీ అష్టోత్తర పూజలు

NTODAY NEWS : చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలోని శ్రీ ఆండాళ్ శ్రీ ఆళ్వార్ల సహిత శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని 11వ లక్ష తులసీ దళార్చన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తులసీ దళాలను సిద్ధం చేసి అర్చన కార్యక్రమానికి అందించారు. తెల్లవారుజామున అర్చకులు శ్రీ కరుణ శంకర్ మిశ్రా మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించి, పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు మరింగంటి లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులచే లక్ష తులసీ దళార్చన నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు మహిళలచే సామూహిక లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించగా, రాత్రి 7 గంటలకు ఆకాశ దీపారాధన, ఆరగింపు, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్టితో మహోత్సవం ముగిసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పాపని జనార్దన్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పిల్లలమర్రి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి కేబుల్ శ్రీనివాస్, కోశాధ్యక్షులు ఆనందం కృష్ణయ్య, చెరుపల్లి గోవర్ధన్, సభ్యులు పిల్లలమర్రి దామోదర్, గుర్రం బిక్షం, మిర్యాల మల్లికార్జున, మిర్యాల వేణు, మిర్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.