పాపన్నగౌడ్ చరిత్రను గుర్తించి ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టాలి : ప్రశాంత్ గౌడ్
NTODAY NEWS : చిట్యాల
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు తెలంగాణ యుద్ధవీరుడు, బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని బీఆర్‌ఎస్ యువజన నాయకుడు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని, సామాన్య ప్రజల హక్కుల కోసం అప్పట్లోనే పోరాడిన మహనీయుడని కొనియాడారు. గోల్కొండ కోటను ఏలిన తొలి బహుజన చక్రవర్తిగా పాపన్న గౌడ్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారని, అలాంటి వీరుడికి తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టడం ద్వారా ఆయన వీరత్వంతో కూడిన చరిత్రను భావితరాలకు అందించినట్లవుతుందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాపన్న గౌడ్ పోరాట చరిత్రను గుర్తిస్తూ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ గౌడ్ కోరారు.