BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 10:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం మండలంలో కూటమి విజయభేరి..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 10:02 AM
53 వీక్షణలు

20 ఎంపీటీసీ స్థానాల్లో 15 చోట్ల ఘన విజయం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మండలవ్యాప్తంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని విజయభేరి మోగించారు. మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 12 స్థానాలు, జనసేన పార్టీ 3 స్థానాలు గెలుచుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో కూటమి మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తెలుగుదేశం పార్టీ విజేతలు: గంపలగూడెం-1 నుంచి కోట వెంకటేశ్వరరావు, కనుమూరు నుంచి తుమ్మూరు విజయలక్ష్మి, వినగడప నుంచి గంధం నరసింహారావు, ఊటుకూరు-1 నుంచి చెరుకూరి సాయిచంద్, ఊటుకూరు-2 నుంచి సింగంశెట్టి వెంకటేశ్వరరావు, పెనుగొలను-1 నుంచి తోట లక్ష్మి, పెనుగొలను-2 నుంచి షేక్ నౌషిన్, మేడూరు నుంచి తోట పేరమ్మ, పెదకొమిర నుంచి బూరుగు అంజలి, కొణిజెర్ల నుంచి కుంటముక్కల రజని, దుందిరాలపాడు నుంచి వాకదాని శ్రీనివాసరావు, చింతలనర్వ నుంచి బొల్లెబోగు కళ్యాణి విజయం సాధించారు. జనసేన పార్టీ విజేతలు: తునికిపాడు నుంచి రామిశెట్టి ప్రదీప్, ఆర్లపాడు నుంచి పసుపులేటి మల్లేశ్వరి, గంపలగూడెం-2 నుంచి చెరుకూరి రామారావు గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజేతలు: గొళ్లపూడి నుంచి మేడిగెల కోటేశ్వరరావు, గోసవీడు నుంచి గద్దల పిచ్చిమ్మ, నెమలి నుంచి కుంభగిరి నరేష్, అమ్మిరెడ్డిగూడెం నుంచి కంచెపోగు వరలక్ష్మి, అనుముల్లంక నుంచి అత్తనూరు మంజూష విజయం సాధించారు. జడ్పీటీసీ స్థానంలోనూ టీడీపీ జయకేతనం: గంపలగూడెం జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట పుల్లమ్మ కైవసం చేసుకున్నారు. ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానంలోనూ విజయం సాధించడంతో మండలంలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై చర్చ: మరోవైపు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.5 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై అధికారిక నిర్ధారణ లేదు. గ్రామపంచాయతీ ఎన్నికలపై అప్పుడే కసరత్తు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి మళ్లింది. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అంశంపై నాయకులు సమాలోచనలు ప్రారంభించారు. తాజా ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని గ్రామాల్లో రాజకీయ బలాబలాలను అంచనా వేస్తూ తదుపరి ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు

.