BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 09:39 pm
Posted by : NAGARAJU GADE

రాజాం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
19 Nov, 2026 - 09:39 PM
17 వీక్షణలు

రాజాం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): రెండు దశాబ్దాల అనంతరం జరగనున్న రాజాం మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పట్టణంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పిలుపునిచ్చారు.

రాజాం మండలం శ్యాంపురంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు ఆయన బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజాం జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి సౌజన్యలతతో పాటు 32 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, కూటమి ప్రభుత్వం చేపట్టిన పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల ఆదరణ, ఆశీర్వాదం పొందాలని అన్నారు. రాజాం మున్సిపల్ ఎన్నికలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనున్నాయని పేర్కొంటూ, ఎన్నికల ప్రాధాన్యతను గుర్తించి ప్రతి అభ్యర్థి క్షేత్రస్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు.