BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:05 PM
11 వీక్షణలు

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సు ప్రారంభం.. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం విజ్ఞప్తి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో తెలంగాణ తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రహదారుల రంగానికి చెందిన నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను ఎన్నికల సమయంలో మాత్రమే పరిమితం చేసి, మిగిలిన సమయాన్ని దేశాభివృద్ధికి కేటాయించాలని సూచించారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక చొరవ తీసుకుని అనుమతులు, నిధులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక జోన్లుగా ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాన్ని సేవా రంగ అభివృద్ధికి కేటాయించగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని తయారీ రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ మూడు జోన్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే రవాణా సదుపాయాలు, రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక కారిడార్లను అనుసంధానిస్తూ పటిష్టమైన రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన రహదారుల వల్ల రవాణా వేగం పెరగడంతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో రహదారులకే కాకుండా వైద్యరంగానికి కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని అత్యాధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు మొత్తం 8 వేల పడకల సామర్థ్యంతో నూతన ఆస్పత్రుల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రహదారుల రంగ నిపుణులు, ప్రతినిధులు తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించాలని కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ పది, సంస్థ కార్యవర్గ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రహదారుల నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పాల్గొన్నారు.