BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 06:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కట్టలేరు వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 06:04 PM
32 వీక్షణలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వంతెనపై శుక్రవారం వరద ఉధృతిని జనసేన పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చింతలపాటి వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు వంతెన పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టలేరుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని గతంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. వంతెన నిర్మాణానికి రూ.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు వివరించారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

వరదల సమయంలో వంతెనపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించాలని జనసేన నాయకులు కోరారు. వంతెన నిర్మాణంలో జాప్యం కొనసాగితే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్కే నాగుల్ మీరా, ఒట్టికుంట కృష్ణ, డైరెక్టర్ మాధవరావు మల్యాల, పీఏసీఎస్ చైర్మన్ కస్తూరి సీతారామస్వామి, ఆరేపల్లి నవీన్, లింగినేని సుధాకర్, పర్షా పుల్లారావు, చెన్న కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.