BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 10:17 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
25 Sep, 2026 - 10:17 AM
11 వీక్షణలు

వాడపల్లి: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 37 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపులో రూ.2.50 కోట్ల నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

హుండీ లెక్కింపులో 84 గ్రాముల బంగారం, 1 కిలో 617 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో భక్తులు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.

భక్తులు స్వామివారిని దర్శించుకుని హుండీలో సమర్పించిన కానుకల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, నిర్వహణతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.