BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:22 pm
Posted by : K MAHESH

నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను రద్దు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:22 PM
11 వీక్షణలు

రెండో విడత లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరం.. ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్ గౌడ్

వలిగొండ, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు పాటించలేదని, ప్రకటించిన జాబితాను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని గ్రామ మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ, వెలువర్తి గ్రామంలో రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు కలిగి ఉన్నవారికి, ఆర్థికంగా అభివృద్ధి చెందినవారికి కూడా ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో నిజంగా ఇల్లు లేని నిరుపేదలు, అర్హత కలిగిన కుటుంబాలకు అవకాశం దక్కకుండా పోతుండటంతో వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని, గ్రామసభ నిర్వహించకుండానే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. అర్హతలు, ఆర్థిక పరిస్థితి, నివాస స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమైన నిరుపేదలను గుర్తించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైనట్లు తేలిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో సమర్పించిన వినతిపత్రం ద్వారా అధికారులను కోరారు.