BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 07:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు చేర్చాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 07:43 PM
6 వీక్షణలు

ప్రముఖులకు విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయుడు రాం ప్రదీప్

తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావన, సోదరభావాన్ని పెంపొందించే భారతదేశ ప్రతిజ్ఞను రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కృషి చేయాలని ఆంగ్ల ఉపాధ్యాయుడు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి ఎం. రాం ప్రదీప్ పలువురు ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు తదితరులను కలిసి పైడిమర్రి వెంకట సుబ్బారావు సేవలను విద్యార్థి లోకానికి మరింత విస్తృతంగా పరిచయం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో ఆయన పేరు, జీవిత విశేషాలకు తగిన స్థానం కల్పించేలా సంబంధిత వర్గాలు చొరవ తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రపై తాను రచించిన పుస్తకాలను ప్రముఖులకు అందజేశారు. భారతదేశ ప్రతిజ్ఞ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవం, ఐక్యత, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావనలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జీవితాన్ని భావితరాలకు పరిచయం చేయడం అవసరమని రాం ప్రదీప్ పేర్కొన్నారు. పైడిమర్రి సేవలకు తగిన గుర్తింపు లభించేలా కృషి జరగాలని ఆయన ఆకాంక్షించారు.