BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 03 February 2026, 08:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి

తెలంగాణ
03 Feb, 2026 - 08:27 AM
312 వీక్షణలు
లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి సెల్‌ఫోన్, నగదు లాక్కునే యత్నం… తీవ్ర గాయాలతో తప్పించుకున్న బాధితుడు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా లిఫ్ట్ అడిగిన వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్న ఓ వ్యక్తిపై దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చిట్యాల మండల పరిధిలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి, మార్గమధ్యలో నార్కట్‌పల్లి సమీపంలో లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని తన కారులో ఎక్కించుకున్నాడు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారుకు చేరుకున్న అనంతరం, ఆ వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో ఇమ్రాన్‌పై దాడికి పాల్పడ్డాడు. దుండగుడు ఇమ్రాన్ మెడతో పాటు శరీరంలోని పలు భాగాలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం అతని సెల్‌ఫోన్, నగదు లాక్కునేందుకు ప్రయత్నించాడు. తీవ్ర గాయాల మధ్య కూడా ఇమ్రాన్ ధైర్యంగా ప్రతిఘటించడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హైవేలపై ప్రయాణించే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. #CrimeNews #KnifeAttack #Chityala #NalgondaDistrict #PublicSafety #HighwayAlert #NTodayNews #TelanganaCrime Follow us on Website Facebook Instagram YouTube