BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 01:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
19 Nov, 2026 - 01:50 PM
19 వీక్షణలు

దేశంలోని మొత్తం సాగులో తెలంగాణ వాటా 21 శాతం.. రైతులకు రూ.430 కోట్ల సాయం

హైదరాబాద్, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్):

దేశవ్యాప్తంగా 15.70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుండగా, తెలంగాణలో 91,343 మంది రైతులు 3.33 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. దీంతో దేశంలోని మొత్తం ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ 21 శాతం వాటాను కలిగి ఉంది.

2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 45,679 మంది రైతులను 1.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం రైతులకు రూ.430 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఎకరాకు రూ.46,250 చొప్పున రాయితీ కల్పిస్తున్నారు.

2025-26 సంవత్సరంలో 25,242 మంది రైతుల నుంచి 5.24 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేసి, వారికి రూ.1,213 కోట్లు చెల్లించారు. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోలో 20.01 శాతంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తుండగా, వచ్చే ఏడాది మరో ఎనిమిది మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కనీసం 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగును విస్తరించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ఇదిలా ఉండగా, టన్ను ఆయిల్‌పామ్ గెలలకు కనీస ధర రూ.25 వేలు నిర్ణయించాలని, ఆదాయ పంపిణీ నిష్పత్తిని 75:25 నుంచి 80:20కి మార్చాలని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.