BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 28 December 2025, 09:13 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళ పరిస్థితి విషమం

తెలంగాణ
28 Dec, 2025 - 09:13 PM
405 వీక్షణలు

బీజేపీ నేత కొడుకుపై ఆరోపణలు చేసిన మహిళ పరిస్థితి విషమం

NTODAY NEWS: మధ్యప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన బీజేపీ నేత కొడుకు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గత ఏడు నెలలుగా నిరంతర అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొంటూ మానసిక వేదనకు గురైన ఆమె నిద్రమాత్రలు, ఎలుకల మందు తీసుకున్నట్లు సమాచారం. శివపురి మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాయత్రి శర్మ కొడుకు రజత్ శర్మపై 2025 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేసిన బాధిత మహిళ ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విషం తీసుకునే ముందు బాధితురాలు ఆరు పేజీల మరణవాంగ్మూలం రాసింది. అందులో గత ఏడు నెలలుగా మానసిక హింస, రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. తన మరణానికి గాయత్రి శర్మ, ఆమె భర్త సంజయ్ శర్మ కారణమని బాధితురాలు లేఖలో స్పష్టం చేసింది. రజత్ శర్మతో తన సంబంధం విషయం వారికి ముందే తెలుసని, పెళ్లి విషయమై మొదట అభ్యంతరం లేదని గాయత్రి శర్మ చెప్పినట్లు పేర్కొంది. అయితే 2025 ఏప్రిల్ 14న రజత్ శర్మకు వేరే చోట నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ఆరోపించింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన రోజే నిశ్చితార్థం జరగగా, ఐదు గంటల పాటు ఎదురు చూసినా ఫిర్యాదు నమోదు చేయలేదని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని రాజకీయ ఒత్తిడి తెచ్చారని బాధితురాలు తెలిపింది. కేసు బయటకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, పదవీ విరమణ చేసిన అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని, రూ.50 లక్షల ప్రలోభం కూడా చూపినట్లు ఆమె మరణవాంగ్మూలంలో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ఆమె విన్నవించుకుంది.  బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద ఏప్రిల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోర్ తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని, బాధితురాలి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె స్టేట్‌మెంట్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. Follow us on Website Facebook Instagram YouTube