BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 23 June 2026, 07:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల జీవిత బీమా

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:15 PM
150 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ జీవిత బీమా పథకాన్ని తీసుకురానుంది. ఎలాంటి ప్రీమియం, చెల్లింపులు లేదా విరాళాలు లేకుండానే రూ.1.20 కోట్ల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సహజ మరణం, ప్రమాద మరణం జరిగిన సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.

ఈ పథకాన్ని జూన్ 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనుంది.

ఈ కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు, యూనియన్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని టీజీఈజేఏసీ పిలుపునిచ్చింది.