BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 23 June 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 09:08 PM
102 వీక్షణలు

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి చెందిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. అసమాన ఆస్తుల కేసులో భాగంగా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

సోదాల్లో 4 ఇళ్లు, ఒక వాణిజ్య భవనం, 8 ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇంకా మూడు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉండగా, వాటిలో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ఈ మొత్తాన్ని మించి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.