BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 23 June 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యుత్ షాక్‌తో గాయపడిన వానరం మృతి.. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖననం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:20 PM
95 వీక్షణలు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఓ వానరం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలోని అశోక్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం విద్యుత్ షాక్ తగలడంతో వానరం మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందపడిపోయింది.

సమాచారం అందుకున్న హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వానరానికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పొద్దుటూరుకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వానరం మృతి చెందినట్లు తెలిపారు.

మృతి చెందిన వానరాన్ని తాడిపత్రి కొత్త బ్రిడ్జి సమీపంలోని పెన్నా నది తీరంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు, ఇతర ప్రమాదకర పరిస్థితుల కారణంగా జంతువులు ప్రాణాలు కోల్పోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వెటర్నరీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోతుల గంగాధర్ యాదవ్, అనంత శివారెడ్డి, కృష్ణ మోహన్ రాజు, జంతు ప్రేమికుడు ఇస్మాయిల్, రోటరీ క్లబ్ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొని వానరానికి నివాళులర్పించారు.