BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 23 June 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వ్యవహారంలో మరో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:19 PM
131 వీక్షణలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజుపై మరోసారి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నాగరాజు అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ ఆస్తులన్నీ ఆయన బినామీగా మారిన బావ తోరం రాము పేరిట ఉన్నట్లు విచారణలో బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రాము ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులకు యజమానిగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన పేరిట విలాసవంతమైన భవనాలు, ఆక్వా వ్యాపారాలు, భూములు, ఎగుమతి సంస్థలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఆరోపణల ప్రకారం..

కోనసీమ జిల్లా అలాపురం గారపాటి వీధిలో రూ.4 కోట్ల విలువైన భవనం

నాగరాజు స్వగ్రామం చెయ్యేరులో రూ.3 కోట్ల భవనం, 25 ఎకరాల వ్యవసాయ భూమి

మహిపాల చెరువు గ్రామంలో రూ.10 కోట్ల విలువైన రొయ్యల మేత కంపెనీ

భీమవరంలో రొయ్యల ఎగుమతి సంస్థ

నేదునూరులో 12 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు

బుట్టపాలెం గ్రామంలో 10 ఎకరాల భూమి

విజయవాడ మద్యం సిండికేట్‌లో వాటా

ఒంగోలులో హేచరీ

అయితే ఈ ఆరోపణలపై అధికారిక దర్యాప్తు సంస్థలు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.