BREAKING
thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం
Date of Publish : 23 September 2026, 07:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కస్టమర్‌లా నటించి సెల్‌ఫోన్ల చోరీ...

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:11 AM
4 వీక్షణలు

కస్టమర్‌లా నటించి సెల్‌ఫోన్ల చోరీ.. యువకుడి అరెస్ట్ రూ.లక్ష విలువైన ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం

ఉయ్యూరు: సెల్‌ఫోన్‌ దుకాణానికి కస్టమర్‌లా వెళ్లి వివిధ మోడళ్ల ఫోన్లను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న యువకుడిని ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన ఓగిరాల గ్రామానికి చెందిన దండుగుల నాగ దుర్గారావు (23) సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు ఉయ్యూరు పట్టణంలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణానికి పలుమార్లు కస్టమర్‌లా వెళ్లేవాడు. అక్కడ వివిధ మోడళ్ల సెల్‌ఫోన్లను పరిశీలిస్తున్నట్లు నటించి, అవకాశం చూసుకుని వాటిని చోరీ చేసేవాడని దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై ప్రతాపరెడ్డి సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలో జరిగిన చోరీకి సంబంధించి కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో నాగ దుర్గారావును గన్నవరం సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ టి.వి.వి. రామారావు తెలిపారు.