BREAKING
గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం
www.ntodaynews.com

కృష్ణార్జునుల్లా పరుగులు పెట్టిస్తున్నారు

తెలంగాణ
17 Nov, 2025 - 06:43 PM
337 వీక్షణలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు : ప్రత్తిపాటి NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా .. • మంత్రి లోకేశ్ సుపరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు • కాపు, బలిజ, తూర్పుకాపు, వర్గీయుల ఆత్మీయ సమావేశం, వనభోజనాల కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి. విశిష్టమైన, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అందరూ ఒకచోట చేరి ఆత్మీయంగా, కలిసి మెలిసి ఉండటమనేది వనభోజనాల్లోనే సాధ్యమవుతుందని, కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలన రాష్ట్ర భవిష్యత్ కు గట్టి పునాది వేసిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని పురుషోత్తమపట్నంలో ఏర్పాటు చేసిన కాపు, బలిజ, తూర్పుకాపు వర్గీయుల ఆత్మీయ సమావేశం.. వనభోజనాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రత్తిపాటి.. తొలుత ప్రాంగణంలో ప్రతిష్టించిన శివలింగానికి పూజలు నిర్వహించి, దీపారాధన చేసిన అనంతరం కాపు సోదరుల్ని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు. కల్మషం లేని స్వచ్ఛమైన మనసున్న కాపు సోదరులు అంతా ఈ పర్వదినాన ఒకచోట చేరి సంతోషంగా వనభోజనాల్లో పాల్గొనడం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోందని ప్రత్తిపాటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్ర ప్రగతిరథాన్ని పరుగులు పెట్టిస్తుంటే, మంత్రి లోకేశ్ వినూత్న ఆలోచనలతో కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడన్నా రు. వారి ముగ్గురి ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ రాష్ట్ర ప్రగతి, ప్రజల యోగ క్షేమాలు, సంతోషమే లక్ష్యంగా ఉంటాయన్నారు. విశాఖ సీఐఐ సమ్మిట్ విజయవంతం రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగాను అభివృద్ధి చేస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. వనభోజనాల కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, షేక్ జమాల్ భాషా, షేక్ అబ్దుల్ కుమీర్, బత్తినేని శ్రీనివాసరావు, అచ్చుకోల భాస్కర్ రావు, దేవిశెట్టి అయ్యప్ప, తోట బ్రహ్మస్వాములు, తోట సత్యం, తోట శ్రీనివాసరావు, తెల్లప్రోలు రామ్మూర్తి, బైరా శ్రీనివాసరావు, నాగబాబు, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube