BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 09 October 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 10:03 PM
2 వీక్షణలు

ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారు.. ప్రధాని మోదీ, అమిత్ షాపై రాహుల్ ఆరోపణలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరుగుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఇండియా కూటమి నేతల భేటీ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న తమ ఆరోపణలపై రాష్ట్రపతి ఆధారాలు కోరినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత ఆధారాలను సేకరించి రాష్ట్రపతికి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.