ఐఫోన్ కొనివ్వలేదని బెదిరింపు..
కొరివితో కొడుకును వెతుక్కుంటూ తండ్రి
వైరల్: ఐఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఐఫోన్ 18 కొనివ్వకపోతే ఒంటికి నిప్పంటించుకుంటానంటూ యువకుడు బెదిరించినట్లు సమాచారం.
కొడుకు బెదిరింపులకు భయపడకుండా అతడి తండ్రి మండుతున్న కొరివిని చేతిలో పట్టుకుని కొడుకును వెతుక్కుంటూ బయటకు వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొడుకు బెదిరింపులకు తండ్రి ఈ విధంగా స్పందించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు, యువకుడి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం స్పష్టంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా మాత్రమే ఘటనకు సంబంధించిన వివరాలను నిర్ధారించలేము.