BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒకే కుటుంబంలో మూడు కీలక పదవులు.. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీగా కుటుంబ సభ్యులు!

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:16 PM
25 వీక్షణలు

రాజవొమ్మంగం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా రాజకీయాల్లో ఒకే కుటుంబానికి మూడు కీలక పదవులు దక్కడం చర్చనీయాంశంగా మారింది. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కుటుంబ సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి మూడు పదవులను దక్కించుకున్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తల్లి కృష్ణవేణి రాజవొమ్మంగం మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తంటికొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఆమె విజయం సాధించారు. అనంతరం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త విజయభాస్కర్ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఉండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సాధారణ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మిరియాల శిరీషాదేవి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రంపచోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.