కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
వాడపల్లి: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించారు.
ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ నిర్వాహకులు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి కూడా తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు శిష్ట్లా కుటుంబరావు, పెండ్యాల భవాని స్వామి, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.