BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 01 November 2025, 04:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్

తెలంగాణ
01 Nov, 2025 - 04:53 AM
483 వీక్షణలు
జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ NTODAY NEWS: చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు బురద చేరటం తో భారీ ట్రాఫిక్ జామ్ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరురావడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. రైల్వే బ్రిడ్జి కింద నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల వలన పోతరాజు కుంట నిండిపోవడంతో కుంటకు అధికంగా నీరు రావటంతో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నాయి దానితోపాటు రహదారిపై బురద పేరుకుపోవడంతో చిన్న చిన్న వాహనాలు ఇరుక్కు పోవడంతో పాటు చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జాతీయ రహదారి పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇరుక్కుపోయిన వాహనాలను మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి సైతం తమ వంతు కృషి చేశారు. టోల్గేట్ సిబ్బంది , నేషనల్ హైవే సంబంధించిన అధికారులు సరైన సమయంలో స్పందించి ఇటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చేయాలని వాహనదారులు వాపోయారు. చాలా గంటల తర్వాత అధికారులు స్థానిక పోలీసులు స్పందించి ట్రాఫిక్ ను పెద్దకాపర్తి, రామన్నపేట మీదుగా మళ్ళించారు. వాహనాలు దారి మళ్లించడంతో రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం దాటిన తర్వాత ఉన్న రైల్వే బ్రిడ్జి కూడా నీళ్లు నిలవడంతో వాహనాలు తిరిగి వస్తున్న తరుణంలో పెద్ద కాపర్తి, రామన్నపేట మధ్య మరికొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి. Follow us on Website Facebook Instagram YouTube