BREAKING
thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:48 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు రాజవంశంలో విషాదం.. రాణి విజయమ్మ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Oct, 2026 - 09:48 AM
25 వీక్షణలు
  • సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహణలో విశేష సేవలు..
  • కుటుంబ సభ్యులకు ప్రముఖుల సంతాపం

పుంగనూరు (ఎన్‌ టుడే న్యూస్‌): అన్నమయ్య జిల్లా పుంగనూరు జమీందారీ రాజవంశానికి చెందిన స్వర్గీయ రాజా ఉదయశంకర్ రాయల్ సతీమణి రాణి విజయమ్మ సోమవారం కన్నుమూశారు. ఆమె మృతి వార్తతో పుంగనూరు పట్టణంలో విషాదం నెలకొంది. పట్టణ ప్రజలు ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గంగమ్మ జాతర నిర్వహణలో విశేష సేవలు

శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను ఎన్నో సంవత్సరాలుగా తన ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా నిర్వహించడంలో రాణి విజయమ్మ కీలక పాత్ర పోషించారు. జాతర నిర్వహణలో ఆమె అందించిన సేవలను పట్టణ ప్రజలు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు.

పలువురు ప్రముఖుల సంతాపం

రాణి విజయమ్మ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సంతాపం తెలిపారు. ఆమె మృతి పుంగనూరు ప్రజలకు తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు.

మంగళవారం అంత్యక్రియలు

మంగళవారం ఉదయం పుంగనూరు ప్యాలెస్‌లో ప్రజల సందర్శనార్థం రాణి విజయమ్మ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల తర్వాత తూర్పు మొగసాలల్లోని మఠం ప్రాంతంలో కుల సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు రాజా మల్లికార్జున రాయల్ తెలిపారు.