BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:16 pm
Posted by : K MAHESH

ఇంటి నుంచే వాహనాల ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్!

తెలంగాణ
/ తెలంగాణ / తెలంగాణ
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 12:16 PM
23 వీక్షణలు

ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.. వాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే సేవలు

తెలంగాణ (ఎన్ టుడే న్యూస్): వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ శుభవార్త అందించింది. వాహనాల యాజమాన్య హక్కుల బదిలీ (ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్) కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ విధానం ద్వారా వాహనదారులు ఇంటి నుంచే అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకునే వీలుంటుంది.

వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా వాహన యాజమాన్య హక్కుల బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వాహనాన్ని విక్రయించే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధిత వివరాలు, అవసరమైన ధ్రువీకరణలు సమర్పించిన అనంతరం కొత్త యజమాని పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) జారీ అవుతుంది.

ఇతర సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే..

ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వాహనాలను తరలించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పొందే సేవలు, ఈ-కేవైసీ అప్‌డేట్ ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించుకునే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు సమయం ఆదా కావడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆన్‌లైన్ సేవలను వినియోగించుకునే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాహన్ సేవల పేరుతో అందుబాటులో ఉండే నకిలీ వెబ్‌సైట్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, వాహన సంబంధిత సమాచారం లేదా డబ్బులు సమర్పించవద్దని హెచ్చరిస్తున్నారు. అధికారిక వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.