BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 06:44 pm
Posted by : PAGADALA DEVAIAH

ఉపాధి కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
09 Nov, 2026 - 06:44 PM
19 వీక్షణలు

మూడు కిలోమీటర్ల దూరంలో పనులు.. ఇబ్బందులు పడుతున్న కూలీలు

తాడూరు, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

తాడూరు మండలంలోని ఇంద్రకల్లు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పనులు కేటాయించడంతో, ముఖ్యంగా మొక్కలు, చెట్లకు నీళ్లు పోసే పనులకు వెళ్లేందుకు కూలీలు అవస్థలు పడుతున్నారని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న తెలిపారు.

ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి దూరంగా పని ప్రదేశాలు కేటాయించినప్పటికీ, అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం కనీస రవాణా సౌకర్యం కల్పించకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ పని ప్రదేశానికి వెళ్లి తిరిగి రావడానికి రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూలీలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

పని ప్రదేశాలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నందున కూలీలకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలని అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీల శ్రమను గుర్తించి వారి సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.

అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.1,500 కూలి చెల్లించాలని, ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. కూలీల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు రాములమ్మ, చిన్నమ్మ, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.