స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల చిన్నారి కోడవాటి నితిన్ మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. నితిన్ అన్నయ్య సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి రాజకుమారి ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో నితిన్ ప్రమాదవశాత్తు బస్సు ముందుకు వెళ్లాడు. చిన్నారి బస్సు ముందు ఉన్న విషయాన్ని డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు ముందుకు కదిలింది. దీంతో నితిన్ బస్సు టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో లంకలకూరపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.