BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 03 August 2026, 11:20 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 11:20 AM
81 వీక్షణలు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ (సీతక్క), పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోగా, సంప్రదాయ బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాలతో లష్కర్ బోనాల జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా, ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు కొనసాగింది. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ నగరం భక్తిరసంలో మునిగిపోయింది.