ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల బదిలీలు
రెండేళ్లకు పైగా పనిచేసిన సీఐలు, ఎస్సైలతో పాటు ప్రత్యేక విభాగాల అధికారులకు స్థానచలనం
వరంగల్ | Ntoday News
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు బదిలీలు జరిగాయి. ఒకే ప్రాంతంలో రెండేళ్లకు పైగా పనిచేసిన సీఐలు, ఎస్సైలతో పాటు ప్రత్యేక విభాగాల్లోని అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ సీ. హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాత్రి సమయంలోనే బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. దీంతో పాత అధికారులు రిలీవ్ కాగా, బదిలీపై వచ్చిన కొత్త అధికారులు ఆయా స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు.
బదిలీల్లో భాగంగా వర్ధన్నపేట సీఐ స్వరూప స్థానంలో జయశ్రీ, నర్సంపేట సీఐ నరేశ్‌రెడ్డి స్థానంలో జయశ్రీ, పరకాల సీఐ తాతాజీ స్థానంలో గురువయ్య నియమితులైనట్లు సమాచారం.
ఎక్సైజ్ శాఖలో పరిపాలనా పరమైన మార్పుల్లో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ పరిధిలో ఎక్సైజ్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.