BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 09:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చండ్రుపట్లలో అగ్ని అస్త్రం తయారీపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 09:53 PM
4 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా అగ్ని అస్త్రం తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఐసీఆర్‌పీ విస్సంపల్లి విజయలక్ష్మి ఇంటి వద్ద అగ్ని అస్త్రాన్ని తయారు చేశారు.

వరి పంటలో కాండం తొలుచు పురుగు, వంగ, బెండ, కంది తదితర పంటల్లో కాయ తొలుచు పురుగుల నివారణకు అగ్ని అస్త్రాన్ని ఉపయోగించవచ్చని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు. అలాగే ఆకు ముడత పురుగుల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

తయారీకి కావాల్సిన పదార్థాలు:

వేప ఆకుల ముద్ద – 5 కిలోలు

పచ్చిమిర్చి పేస్ట్ – 1 కిలో

పొగాకు – 1 కిలో

వెల్లుల్లి పేస్ట్ – 500 గ్రాములు

నీరు – 10 లీటర్లు

తయారీ విధానం:

మట్టి కుండలో 10 లీటర్ల నీటిని పోసి మరిగించి, అందులో వేప ఆకుల ముద్ద, పచ్చిమిర్చి పేస్ట్, పొగాకు, వెల్లుల్లి పేస్ట్ వేసి ఐదు సార్లు పొంగు వచ్చే వరకు మరిగించాలి. అనంతరం మిశ్రమాన్ని సుమారు 48 గంటల పాటు చల్లార్చాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వడకట్టి, అందులో 10 లీటర్ల గోమూత్రం కలపాలి. మిశ్రమాన్ని మరిగించే సమయంలో గోమూత్రం కలపకూడదని సూచించారు.

తయారైన అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీటికి 3 లీటర్ల చొప్పున కలిపి ఎకరా పంటపై పిచికారీ చేసుకోవచ్చని తెలిపారు. తయారు చేసిన అగ్ని అస్త్రాన్ని సుమారు మూడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎంటీ జి. శ్రీనివాస్‌రావు, ఐసీఆర్‌పీ వి. విజయలక్ష్మి, టి. ఐసీఆర్‌పీలు జి. భారతి, బి. శాంతి పాల్గొన్నారు.