BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 19 July 2026, 05:21 pm
Posted by : V శ్రీనివాస్

​వైభవంగా బోనాల జాతర.. ఆకట్టుకున్న ఫలహార బండి శోభయాత్ర

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jul, 2026 - 05:21 PM
288 వీక్షణలు

​వైభవంగా బోనాల జాతర.. ఆకట్టుకున్న ఫలహార బండి శోభయాత్ర

మంచిర్యాల జిల్లా కేంద్రంలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం నుండి కాళీమాత ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ శోభయాత్రను ప్రారంభించి, కాళీమాత చల్లని చూపు మంచిర్యాలకు ఉండాలని ఆకాంక్షించారు. నల్ల శంకర్ ఫలహార బండి శోభయాత్ర అద్భుతంగా జరిగిందని ఆమె కొనియాడారు.

​పోతరాజుల నృత్యాలు, శివపార్వతుల వేషాలు, డప్పు వాయిద్యాలు, మహిళల సందడితో ఈ ఊరేగింపు ఆద్యంతం వైభవంగా ప్రారంభమైంది. గోపాల్ వాడ వద్ద బోనాలతో మహిళలు గాంధీనగర్ నుంచి కాళీమాత ఆలయం వరకు బోనాల జాతర నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రమ్య, కార్పొరేటర్లు, ఆలయ నిర్వాహకులు రఘు స్వామి, పెట్టం తిరుపతి తదితరులు పాల్గొన్నారు